మిథాలీరాజ్‌కు అరుదైన గౌరవం.. వందమంది ప్రపంచ ప్రభావశీలుర మహిళల జాబితాలో చోటు!

  • విడుదల చేసిన బీబీసీ
  • జాబితాలో మొత్తం ఏడుగురు భారతీయ మహిళలు
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్‌కు అరుదైన గౌరవం లభించింది. బుధవారం బీబీసీ విడుదల చేసిన వందమంది ప్రపంచ ప్రభావశీలుర మహిళల జాబితాలో మిథాలీకి చోటు దక్కింది. ఈ జాబితాలో ఆమెతో పాటు మొత్తం ఏడుగురు భారతీయ మహిళలకు కూడా చోటు లభించింది.

బీబీసీ వందమంది ప్రభావశీలుర మహిళల జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయులు వీరే..

టీమిండియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్, రచయిత, యోగా టీచర్ అయిన ఇరా త్రివేదీ, ఎంబైబ్ వ్యవస్థాపకురాలు, సీఈవో అదితి అవస్థి, తీహార్ జైలులోని చిన్నారులకు 8 సంవత్సరాలుగా పాఠాలు చెబుతున్న తులికా కిరణ్, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తల్లి మెహరూనిసా సిద్ధిఖీ (65), సామాజిక వ్యాపారవేత్త, మహిళా హక్కుల కార్యకర్త డాక్టర్ ఊర్వశి సహానీ, హెల్త్ కేర్ అనలిటిక్స్ కంపెనీ కేర్ సెంట్రాలోని బిజినెస్ అనలిస్ట్ నిత్య తుమ్మలచెట్టి.
Go Back to Shorts
Mithali raj
bbc list
indian women

More Telugu News